top of page

🌟 రామ్‌ చరణ్‌, చిరును కలిసిన నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ.. 🎬

ట్రిపులార్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ క్రేజ్‌ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అంతకు ముందు తెలుగులో భారీ విజయాలను అందుకున్నా ట్రిపులార్‌ సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చెర్రీకి క్రేజ్‌ పెరిగింది. 🎉🎥ఈ సినిమాతో చెర్రీ ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారాడు.🌟

ఈ క్రమంలోనే.. రామ్‌ చరణ్‌తో హాలీవుడ్ మేకర్స్ సినిమా తీసేందుకు మొగ్గు చూపుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధింంచిన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.🎉🎥 అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మరోసారి చెర్రీ హాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధింంచిన వార్తలకు బలాన్ని చేకూర్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో టెడ్ సరాండొస్‌ తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు.🌟

హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే.. సరాండొస్‌ నేరుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రామ్‌ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిర్మాత శోభు యార్లగడ్డ ఉన్నారు.🎉🎥 వీరితో భారత్‌లో తమ తదుపరి ప్రణాళికల గురించి, వ్యాపార విస్తరణ, సినిమాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టెడ్‌ సరాండొస్‌ మెగా ఫ్యామిలీని కలిసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ భేటీతో చెర్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ప్రాజెక్ట్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 🎉🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page