top of page
Suresh D

ఇండియాలో యూజర్స్‌‌కి షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. 😱🎬

ఇండియాలో తన యూజర్లకు షాక్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్‌ను క్లోజ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటి సభ్యులు ఒక అకౌంట్‌ను మాత్రమే యాక్సస్ చేయగలరని స్పష్టం చేసింది. 🏠🔐గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. తిరిగి యూజర్లను పెంచుకోవడానికి అనేక ప్రయోగాలు చేసింది.

ఇండియాలో తన యూజర్లకు షాక్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్‌ను క్లోజ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటి సభ్యులు ఒక అకౌంట్‌ను మాత్రమే యాక్సస్ చేయగలరని స్పష్టం చేసింది. 🏠🔐గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. తిరిగి యూజర్లను పెంచుకోవడానికి అనేక ప్రయోగాలు చేసింది. ఇందులో భాగంగా యూజర్లు తమ కుటుంబ సభ్యులతో, సమీప బంధువులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా నెట్‌ఫ్లిక్స్‌ను ఇంట్లో, ప్రయాణంలో, వెకేషన్‌లో ఉన్నా ఆ అకౌంట్ యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత నెట్‌ఫ్లిక్స్ తన నిర్ణయాన్ని క్రమంగా వెనక్కి తీసుకుంటూ వచ్చింది. గత మే నెలలో నెట్‌ఫ్లిక్స్ యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలోనే పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది నెట్‌ఫ్లిక్స్. అయితే, ఈ నిర్ణయం వలన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ల మంది కొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చారు. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం.. తాజా త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 📈💰


bottom of page