top of page
MediaFx

నెస్లే సెరెలాక్‌ పిల్లలకు ప్రమాదమా..? నిపుణుల షాకింగ్‌ విషయాలు


2015లో స్విస్ కంపెనీ నెస్లే మ్యాగీకి సంబంధించి వివాదంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. పిల్లల ఆహార ఉత్పత్తుల తయారీ విషయంలో నెస్లే అంతర్జాతీయ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. భారతదేశంలోని నెస్లే బేబీ-ఫుడ్ బ్రాండ్ సెరెలాక్ వంటి బేబీ ఉత్పత్తులకు ఎక్కువ చక్కెరను జోడిస్తుందని మరొక స్విస్ కంపెనీ పబ్లిక్ ఐ చేసిన పరిశోధన తెలిపింది. అనేక ఇతర దేశాల్లో ఈ ఉత్పత్తిని చక్కెర లేకుండా లేదా చాలా తక్కువ చక్కెర మోతాదుతో తయారు చేస్తారు. భారతదేశంలో అన్ని సెరెలాక్ బేబీ ఉత్పత్తుల్లో ఒక్కో సర్వింగ్‌కు 3 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది పిల్లలలో దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయాన్ని నివారించడానికి రూపొందించిన అంతర్జాతీయ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని పబ్లిక్ ఐ నివేదిక తర్వాత, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, FSSAI ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాయి.

నెస్లేకు చెందిన సెరెలాక్‌లో షుగర్ ఎక్కువగా ఉందా లేదా అనేది దర్యాప్తు చేయాల్సిన అంశమని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ హెచ్‌ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదికపై విచారణ పూర్తి చేసినప్పుడే అంతా స్పష్టమవుతుంది.ప్రశ్న ఏమిటంటే, చాలా చక్కెర పిల్లలకు ప్రమాదకరమా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే సమాధానం వస్తుంది. అదనపు చక్కెర పిల్లలలో అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్యలు స్థూలకాయం, మధుమేహాన్ని కలిగిస్తాయి.

bottom of page