ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన వైద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో NEET UG 2023 రౌండ్ 1 కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2022 కౌన్సెలింగ్ కోసం రౌండ్ వన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన వైద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో NEET UG 2023 రౌండ్ 1 కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.NEET UG 2023 కౌన్సెలింగ్ ఈ నెలలోనే స్టార్ట్ అవొచ్చు.
NEET UG కౌన్సెలింగ్ 2023 కోసం అవసరమైన డాక్యుమెంట్స్:
NEET UG అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్
అభ్యర్థి ఫోటో
అభ్యర్థి సంతకం
DOB సర్టిఫికేట్ (10th పాస్ సర్టిఫికేట్)
అర్హత సర్టిఫికేట్ (12వ మార్క్‌షీట్ లేదా సర్టిఫికేట్)
కేటగిరీ సర్టిఫికేట్ (సాధారణం కాకుండా)
క్యారెక్టర్ సర్టిఫికేట్
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్
గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/ఓటర్ ID/పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/రేషన్ కార్డ్)
నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్దిష్ట తేదీలు, వివరాలను మాత్రం జాతీయ వైద్య కమిషన్ ఇప్పటివరకు చెప్పలేదు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ చూడాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెడికల్ సీటు పొందేందుకు నీట్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని మెడికల్ సీట్లను ఆలిండియా, స్టేట్ కోటాల మధ్య 15-85 నిష్పత్తిలో కేటాయిస్తారు. NEET కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
1) mcc.nic.in లో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
2) హోమ్‌పేజీలో, 'UG మెడికల్ కౌన్సెలింగ్' విభాగంపై క్లిక్ చేయండి.
3) రిజిస్ట్రేషన్ కోసం లింక్ ప్రదర్శించబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
4) అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి, పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
5) లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపండి.
6) పత్రాలను అప్‌లోడ్ చేయండి
7) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి, ఫారమ్‌ను సమర్పించండి.
8) దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.