top of page

‘నీట్‌ యూజీ నిందితులను వదిలిపెట్టేది లేదు.. కఠినంగా శిక్షిస్తాం’.. ప్రధాని మోదీ


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక అంశాలపై ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీట్ యూపీ పేపర్‌ లీక్‌పై కూడా స్పందించారు. లీక్‌ ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందని మోదీ అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీల విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ నిందితులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మోదీ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ దోస్త్‌ మూడో విడత గడువు పెంపు.. ఎప్పటి వరకంటే!

హైదరాబాద్‌: దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ గడువును జులై 2 నుంచి 4వ తేదీ వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జులై 3 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు.

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విజయవాడలో ఆర్కిటెక్చర్‌ పీజీ కోర్సులకు ప్రవేశాలు

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ.. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విజయవాడ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ డైరెక్టర్‌ రమేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాలకు సంబంధించి మొత్తం 9 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో కోర్సుల్లో 25 సీట్ల చొప్పున మొత్తం 225 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page