top of page
MediaFx

ప్రకృతి ప్రకోపం.. కొండచరియలు విరిగిపడి 2000 మందికిపైగా సజీవ సమాధి

పపువా న్యూగినియా ప్రకృతి విపత్తు నుండి కోలుకోలేకపోతోంది. ఉత్తర పపువా న్యూగినియాలోని ఎంగా రీజియన్‌లో కొండచరియలు విరిగిపడి 2000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని ఆ దేశ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ఘటనలో గ్రామాలు నాశనం అయ్యాయి. మొదట 600 మంది చనిపోయారని అంచనా వేసినా, ఇప్పుడు ఈ సంఖ్య 2000 దాటింది. భారీ వర్షాల కారణంగా ఈ విపత్తు సంభవించడంతో సహాయక చర్యలు ప్రమాదకరంగా మారాయి.

ఆ ప్రాంతంలో దాదాపు 4000 మంది నివాసం ఉండగా, సగం కంటే ఎక్కువ మంది చనిపోయారు. ప్రాణాలతో ఉన్నవారికి కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ప్రజల జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు. శిథిలాల నుంచి ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. శవాలను వెలికితీసేందుకు స్థానికులు పారలు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

bottom of page