భారత సినీ సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్రం ప్రకటిస్తుంది. డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందిస్తుంది. ఇక ఈ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరిలో బలగంతో పాటు ‘కార్తికేయ 2’, ‘మేజర్’, ‘సీతారామం’ పోటీలో నిలవగా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది. కన్నడ విభాగంలో కేజీయఫ్ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. మరాఠీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ది టెర్మైట్ అవార్డు దక్కించుకోగా.. మనోజ్ బాజ్‌పాయ్ గుల్‌మోహర్ చిత్రం హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. తమిళంలో పొన్నియిన్ సెల్వన్ – 1, మలయాళంలో సౌది వెళ్లక్క సీసీ 225/2009 చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి.