top of page

యాంకర్ సుమను ర్యాగింగ్ చేసిన నటసింహం.. పోరీ హుషారుగుందిరో.. అంటూ..

అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబుతో పాటు విమలారామన్, మమతామోహన్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబుతో పాటు విమలారామన్, మమతామోహన్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే రుద్రంగి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య తన ఎనర్జిటిక్ స్పీచ్ తో అదరగొట్టారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమను ఓ ఆటాడుకున్నారు బాలయ్య.బాలకృష్ణ స్పీచ్ మొదలవ్వగానే అభిమానులంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అలాగే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ నినాదాలు చేశారు. అది విన్న బాలయ్య ఊరుకొండయ్య.. బాలయ్య బాబు సెక్సీ అంటే సుమ , విమలారామన్, మమతామోహన్ దాస్ అసూయా పడతారు.

బాలయ్య బాబు సెక్సీ అంటే సుమ ఈర్ష పడుతుంది అని అన్నారు. అలాగే నేను ఏమీ మాట్లాడక ముందే ఫ్యాన్స్ చప్పట్లు కొడతారంది. సుమకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం.. కానీ జాగ్రత్తగా ఉండాలి ఆమె తిరిగి చెప్పు దెబ్బలు కొడుతుంది.. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో అని సెటైర్లు వేశారు. అంతే కాదు పోరీ హుషారుగుందిరో అంటూ పాట కూడా అందుకున్నారు బాలయ్య.


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page