top of page
Suresh D

ప్రధాని మోదీ నాలుగు రాష్ట్రాల పర్యటన.ప్రాజెక్టులకు శంకుస్థాపన..

జులై 7, 8 వ తేదిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్‎ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆయన దాదాపు రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

జులై 7, 8 వ తేదిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్‎ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆయన దాదాపు రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ-స్టేషన్ పునరాభివృద్ధి పనులకు దాదాపు 450 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అధునాతన సాంకేతికతతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో గోరక్‌పూర్ స్టేషన్‌ను కేంద్రం తీర్చిదిద్దనుంది.ఆ తర్వాత అదే రోజున బికనీర్‌లో ప్రధాని అమృత్‌సర్ జామ్‌నగర్ రైల్వే కారిడర్ మధ్య ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ.11,125 కోట్ల వ్యయంతో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. హనుమాంగర్ జిల్లాలోని జక్దవాలి నుంచి నుంచి జాలోర్ జిల్లాలో ఖేత్లవాస్ వాస్ వరకు ఈ సెక్షన్ నడవనుంది.ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గింస్తుంది. అలాగే ప్రధాన నగరాలు, పారిశ్రామిక కారిడర్‌ల మధ్య ప్రయాణ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. గూడ్స్ లాంటి రవాణాను సులభతరం చేయడంతో పాటు పర్యాటక, ఆర్థికాభివృద్ధిని కూడా పెంపొందిస్తుందిఇదిలా ఉండగా జులై 8 న ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌ పూర్ లో 3 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభినున్నారు. అలాగే గోరఖ్‌పుర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.


bottom of page