🏛️ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ⚖️
అంగళ్లు ఘటనలో బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 🏢 వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ⚖️ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ కూడా వాయిదా పడింది. 🏛️ బుధవారం మధ్యాహ్నం రెండుంబావుకు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. 📝 ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. 🏛️ అటు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.
🤝 మరోవైపు నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. 🤝 చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. 🗳️ జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించానన్నారు నారా లోకేశ్. 📰 అనంతరం జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు, ఢిల్లీ నుంచి వర్చువల్‌గా లోకేష్ హాజరయ్యారు. 🤝 టీడీపీ కార్యక్రమాల పర్యవేక్షణకు 14 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. 🧐