top of page
Suresh D

వైశాలి డైరెక్టర్‌తో ఆది పినిశెట్టి శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్‌🎥🎭 ..

హీరో, నటుడు ఆది పినిశెట్టి తాజాగా నటించిన సినిమా శబ్దం. వైశాలి మూవీ డైరెక్టర్ అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి నటిస్తున్న రెండో సినిమా శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు.🎥🎭

తెలుగు మంచి హీరోగా, పవర్ ఫుల్ విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. వైశాలి మూవీతో హీరోగా మంచి హిట్ కొట్టిన ఆది పినిశెట్టి.. సరైనోడు, ది వారియర్ సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి వెండితెరపై వైశాలీ మూవీ కాంబో రిపీట్ కానుంది. వైశాలి మూవీ డైరెక్టర్ అరివళగన్, ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ శబ్దం. 

అరివళగన్, ఆది పినిశెట్టి కాంబోలో వస్తున్న ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీని 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎస్ భానుప్రియ శివ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శబ్దం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆది పినిశెట్టి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు. శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిగా ఉంది.

శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తూ కనిపిస్తుండగా, చాలా పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. జాకెట్ వేసుకుని, కళ్ల జోడు ధరించి ఆది స్పాట్‌లో కెమెరా, ఫ్లాష్‌లైట్‌లను గమనించడం ఫస్ట్ లుక్ లో ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఆది అంధుడిగా కనిపిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ టెర్రిఫిక్ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కమరింతగా పెంచింది.

వైశాలి చిత్రంలో చాలా రైన్ బేస్డ్ సన్నివేశాలు ఉండగా.. శబ్దం సినిమాలో చాలా సన్నివేశాలు పర్వతాలు, పర్యాటక ప్రదేశాలలో చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. తెలుగు, తమిళం బై లింగువల్ చిత్రంగా తెరెకకెక్కుతున్న శబ్దం సినిమాను ముంబయి, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్ల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించారు.

సంగీత దర్శకుడు తమన్ శబ్దం సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా శబ్దం సినిమాలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ల్సీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.🎥🎭

bottom of page