top of page
MediaFx

బాలయ్య బాబు బర్త్ డే.. సంబరాల్లో అభిమానులు

ఈ రోజు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఎన్నో విజయాలు సాధించారు. సినిమాలే కాకుండా రాజకీయాలలో కూడా రాణిస్తూ, ప్రస్తుతం అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తాతమ్మకల అనే సినిమాతో నటుడిగా పరిచయమైన బాలయ్య, తన తండ్రి ఎన్. టి. ఆర్. దర్శకత్వంలో అనేక సినిమాలలో అద్భుతంగా నటించారు. తాతమ్మకల, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి చిత్రాలలో నటించారు. ఎన్నో విజయాలతో పాటు అవార్డులను కూడా అందుకున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు సంబరాలు

బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, కార్యకర్తలు బాలకృష్ణకు విషెస్ తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు, సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అప్‌కమింగ్ మూవీస్ అప్డేట్స్

ఈ సందర్భంగా బాలకృష్ణ-బోయపాటి కాంబోలో నాలుగో సినిమాను ప్రకటించారు. సింహ, లెజెండ్, అఖండ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత, ఈ కొత్త ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చివరిసారిగా చేసిన "భగవంత్ కేసరి" మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారని సమాచారం.



Related Posts

See All
bottom of page