top of page

నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్ళు.. 20 గేట్లు ఎత్తివేత..


నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 585.10 అడుగుల నీటి మట్టడానికి చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం 297.50టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆశించిన స్థాయిలో నాగార్జునసాగర్ కు వరద రాకపోవడంతో రిజర్వాయర్ వట్టి పోయింది. 2022 ఆగష్టు 11న క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారిగా ఇప్పుడు అధికారులు గేట్లను ఎత్తివేశారు. సాగర్ కు పర్యాటకుల తాకిడి..

నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తిన విషయం తెలుసుకొని జలాశయం అందాలను చూసేందుకు రెండో రోజు కూడా భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడిని పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. సాగర్‌ అందాలను తిలకించడానికి పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాట క ప్రాంతాలైన అనుపు, బుద్ధ వనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృ హం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది.

Comments


bottom of page