top of page
Shiva YT

నాగాలాండ్‌లో ప్రకృతి బీభత్సం..3 కార్లపై బండరాళ్లు పడి ఇద్దరు మృతి

అసలు అక్కడ ఏం జరిగింది? అందుకు సంబంధించిన వీడియోలో ఏముంది? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

నాగాలాండ్.. దిమాపూర్ లోని చుమౌకెడిమాలో... భారీ వర్షాలకు తోడు.. కొండరాళ్లు జారి పడ్డాయి. ఘాట్ రోడ్డు హైవేపై జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు రోడ్డుపై నిలిచి ఉన్నాయి. ఇంతలో రెండు భారీ కొండరాళ్లు... అత్యంత వేగంగా రోడ్డుపైకి దొర్లుతూ వచ్చాయి. వాటి వేగానికి మొత్తం మూడు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. వాహనదారులు వాటిని గమనించలేకపోయారు. వారు కార్లలోనే ఉన్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు కన్ఫామ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక బండరాయి.. రెండు కార్లను ధ్వంసం చెయ్యగా.. మరో బండరాయి వల్ల మరో కారు ధ్వంసమైంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. "ఇది చాలా ఘోరం" అని ఓ యూజర్ స్పందించగా... "ఇది చూసిన తర్వాత నా గుండె పగిలిపోయింది" అని మరో యూజర్ స్పందించారు.

"వర్షాకాలంలో పర్యాటక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. అలాగని అక్కడికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలలో ఇలాంటివి జరగొచ్చు. ప్రాణాలే పోవడం బాధాకరం" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అందువల్ల అక్కడక్కడా ఇలాంటి కొండ రాళ్లు జారి పడుతున్నాయి. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో హెచ్చరిస్తోంది.

bottom of page