top of page

ఆ నటుడు ఫాన్స్ దెబ్బకి నాగబాబు క్షమాపణ...🎭📽️

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన తండ్రి, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ ఈవెంట్ లో పోలీసు క్యారెక్టర్లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం కూడా అయ్యాయి. వీటిపై విమర్శలు రావడంతో ఇవాళ నాగబాబు స్పందించారు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమాల్లో పోలీసు క్యారెక్టర్లపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. ఇంతకీ నాగబాబు సినిమాల్లో పోలీసు క్యారెక్టర్లపై ఏమన్నారంటే.. పోలీసు క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు (తన కుమారుడు వరుణ్ తేజ్ ను ఉద్దేశించి) చేస్తే బావుంటుందని, 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు చేస్తే నప్పదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కలకలం రేగింది. నాగబాబు వ్యాఖ్యలు ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్న సిబ్బందిని అవమానించేలా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. 🎭📽️


bottom of page