పుష్ప 1 సినిమా బడ్జెట్, వసూలు చేసిన కలెక్షన్లు, పుష్ప 2 నిర్మాణానికి వెచ్చిస్తున్న బడ్జెట్ వివరాలు, నటీనటుల టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ఆదాయ పన్ను చెల్లింపులు,జీఎస్టీ చెల్లింపులు తదితర వివరాలను తెలుసుకుంటున్నారు ఐటీ అధికారులు.
మైత్రి మూవీస్, దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా ఐటీ బృందాలు సోదాలు జరుపుతున్నారు. పుష్ప 1 సినిమా బడ్జెట్, వసూలు చేసిన కలెక్షన్లు, పుష్ప 2 నిర్మాణానికి వెచ్చిస్తున్న బడ్జెట్ వివరాలు, నటీనటుల టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ఆదాయ పన్ను చెల్లింపులు,జీఎస్టీ చెల్లింపులు తదితర వివరాలను తెలుసుకుంటున్నారు ఐటీ అధికారులు. మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ శాఖ నజర్ పెంచింది. మైత్రి మూవీకి ముంబైతో ఉన్న లింకులపై అధికారులు ఆరా తీశారని తెలుస్తోంది.ముంబైకి చెందిన ఓ ఫైనాన్సర్ నుంచి డబ్బు తీసుకొని బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధమైనట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్‌గా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది.