top of page

🤯 మనిషి బ్రెయిన్లో మస్క్ చిప్.. అసలు ఎలా పని చేస్తుంది ??

🧠 న్యూరాలింక్ కంపెనీ మొదటిసారిగా మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలన్ మస్క్‌ ప్రకటించారు.

ఈ ప్రయోగం తర్వాత ఆ వ్యక్తిలో మెదడు కార్యకలాపాలను అనుక్షణం గమనిస్తున్నామని, ఆ వ్యక్తి కోలుకుంటున్నారని మస్క్ తన ఎక్స్ ప్లాట్ ఫాం ద్వారా వెల్లడించారు. 🧑‍💻 ఈ ప్రయోగం ద్వారా తమ లక్ష్యమేంటన్నది కూడా న్యూరా లింక్ చాలా స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా మనిషి మెదడును కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసి, సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యల పరిష్కరించాలన్నది తమ టార్గెట్ అన్నది వారి మాట. 🔬 అయితే, కేవలం న్యూరాలింక్ మాత్రమే కాదు చాలాకంపెనీలు ఇలాంటి పరికరాలపై పరిశోధనలు చేస్తున్నాయి. 🌐


bottom of page