తెలంగాణ ఎంసెట్-2023 ఫేజ్ 2 కౌన్సెలింగ్ సోమవారం (జులై 24) నుంచి ప్రారంభమవుతుంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్ధులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు తేదీ జులై 23తో ముగిసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఎంసెట్-2023 ఫేజ్ 2 కౌన్సెలింగ్ సోమవారం (జులై 24) నుంచి ప్రారంభమవుతుంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్ధులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు తేదీ జులై 23తో ముగిసిన సంగతి తెలిసిందే. 📅🗂️ కాగా తొలి విడతలో మొత్తం 70,665 మంది సీట్లు పొందారు. 🎓🏅 వీరిలో సుమారు 53 వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 👨🎓📝 వీరిలో దాదాపు 18 వేల మంది ఫీజే చెల్లించలేదు.🙅♂️📛 చాలా మంది విద్యార్ధులు అధాక వర్షాల కారణంగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయామని, గడువు పొడిగించవల్సిందిగా అభ్యర్ధిస్తున్నారు.📜🏫 తొలి విడతలో సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు ఆ సీటు వదులుకుని రెండో విడత కౌన్సెలింగ్‌లో మెరుగైన కాలేజీ సీటు కోసం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు.🏛️🎓 కాగా జులై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇక చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగనుంది.