top of page

"భగవంత్ కేసరికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు.. విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్.. 🎬💰

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. 🌟 ఫస్ట్ డే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. 💰

వీరసింహారెడ్డి కంటే ఇది తక్కువ కలెక్షన్లే అయినా కూడా.. లియోతో పోటీ ఉండటంతో సగానికి పైగా థియేటర్స్ తక్కువయ్యాయి. 💥 దాంతో కలెక్షన్స్ కూడా కాస్త తగ్గాయి.

విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. 🌠 మొదటి రోజు అందరి అంచనాలు నిలబెడుతూ ఈ చిత్రం దాదాపు 120 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. 📈 ఫైనల్ ఫిగర్స్ ఇంకా బయటికి రాలేదు. 📊 కచ్చితంగా ఆదిపురుష్, జవాన్ సినిమాలను దాటేసి ఉంటుందని అంచనా. వీకెండ్ ముగిసేనాటికి లియో సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి. 📆

ముంబై వీధుల్లో కొన్నేళ్లుగా మాస్క్ వేసుకుని క‌నిపించిన వ్య‌క్తి రాజ్ కుంద్రా. 🕵️‍♂️ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త ఈయన. ఆ మధ్య బ్లూ ఫిల్స్ కేసులో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి కుంద్రా అలాగే తిరుగుతున్నా డు. 🕵️‍♀️ ఈనేప‌థ్యంలోనే ట్వీట్‌లో విడాకులు అంటూ ప్రస్థావించాడు అయితే ఆయన విడిపోయేది మాస్క్‌తోనా లేదంటే శిల్పాతోనా అనేది సస్పెన్స్ మెయింటేన్ చేసి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. 🤔 తన బయోపిక్‌లో తానే నటిస్తున్నాడు. 📽️ దానికి UT69 టైటిల్ పెట్టారు. 🎞️

సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా మామా మశ్చీంద్ర. 🎭 హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల కిందే థియేటర్స్‌లో విడుదలైంది. 🎉 తాజాగా ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. 📺 కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేసాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. 🎥"

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page