🎼🎨 కళాతపస్వి కె. విశ్వనాధ్ గారు తీసిన ఎన్నో ఆణిముత్యాలలో “సాగర సంగమం” నిజంగానే సాగరం అంత లోతైన భావాన్ని తెలిపే చిత్రం. ఇందులో నెంబర్ 1 మెలోడీ పాట ఏదంటే ఆలోచించాల్సిన పనిలేకుండా టక్కున “మౌనమేలనోయి” అని చెప్పేస్తాం. 🎵🎞️ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నాకూడా అది పైకి చెప్పలేక ఇబ్బంది పడే ఇద్దరి సున్నిత వ్యక్తుల మనసులోని ఉద్దేశం ఈ పాట. జానకి, బాల సుబ్రహ్మణ్యంలు పాడిన ఈ పాట, ఇళయరాజా గారు కంపోస్ చేసారు. 🎶🎹🎤 ఇది ఎప్పటికి ఒక ఆణిముత్యమే. 🎶🎬🎼