top of page
MediaFx

కల్కి సినిమాకు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈమూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ వంటి స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రూ. 600 కోట్లు బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటినీ కలిగించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సరికొత్తగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాలో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లైఫ్ లో స్పెషల్ పర్సన్ అంటూ బుజ్జి కారును రివీల్ చేయుకుండానే ఒక్కసారిగా అభిమానులను అలర్ట్ చేశారు. ఇక డార్లింగ్ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అంటూ బుజ్జి కారును పరిచయం చేయడంతో కల్కి ప్రమోషన్స్ పై మరింత ఆసక్తిని కలిగించారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా కోసం ప్రభాస్ నుంచి కమల్, అమితాబ్ వరకు ఒక్కొక్కరి రెమ్యునరేషన్ వివరాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

రెమ్యునరేషన్ వివరాలు.. తాజా సమాచారం కల్కి మూవీ కోసం ప్రభాస్ రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇందులో విష్ణుమూర్తి పదవ అవతారం కల్కి స్పూర్తితో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను సృష్టించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ కోసం లోకనాయకుడు కమల్ హాసన్ ఏకంగా రూ.50 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఇందులో కేవలం అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక దీపికా పదుకొణె రూ.10 కోట్లు.. అశ్వాత్థమ పాత్ర కోసం అమితాబ్ రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసినిమాలో భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్ కోసం ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా కల్కి చిత్రానికి రూ.600 కోట్ల బడ్జెట్ వెచ్చించారు.

bottom of page