top of page
MediaFx

నిద్ర లేచిన వెంటనే ఈ వస్తువులు కనిపిస్తే శుభ సంకేతమట..🌅

సూర్యోదయానికి ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. సూర్యోదయ సమయంలో మనస్సు, మెదడు చాలా సున్నితమైన స్థితిలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సూర్యోదయ సమయంలో సానుకూల విషయాలను ఆలోచించాలి. తద్వారా రోజంతా సరిగ్గా గడుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఉదయం కొన్ని దృశ్యాలు, విషయాలు కనిపిస్తే ఆ రోజంతా బాగా గడిచిపోతుంది. అటువంటి పరిస్థితిలో కొన్ని శుభ సంకేతాలను పొందడం శుభ ఫలితాలకు దారితీస్తుంది.

ఈ విషయాలు శుభ సంకేతాలను ఇస్తాయి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉదయం నిద్రలేవగానే చేయవలసిన మొదటి పని తన అరచేతులను చూసుకోవాలి. ఎందుకంటే సరస్వతితో పాటు బ్రహ్మ, లక్ష్మి కూడా మన చేతుల్లోనే ఉంటారు. ప్రతిరోజూ ఉదయం ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, అదృష్టం ఉంటుందని విశ్వాసం. అదేవిధంగా జ్యోతిషశాస్త్రంలో ఇలాంటి కొన్ని సంకేతాలు ప్రస్తావించబడ్డాయి. ఉదయాన్నే వీటి చూసినా, కొన్ని విషయాలు విన్నా శుభసూచకాలుగా పరిగణింపబడుతున్నాయి.

ఉదయం ఇంటి నుంచి బయటకు రాగానే ఆవు లేదా ఆవు తన దూడకు పాలు తినిపించడం చూస్తే. లేదా తెల్లటి ఆవు మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి బిగ్గరగా మూలుగుతుంటే, మీ జీవితంలో ఆనందం ఖచ్చితంగా పెరుగుతుందని నమ్ముతారు, అది విధి అనుకూలతకు సంకేతం. మీ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీరు దాని నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.

ఉదయాన్నే కళ్లు తెరిచిన వెంటనే శంఖం, గుడి గంటల శబ్దం, మంత్రోచ్ఛారణ వంటివి వినిపిస్తే శుభం కలుగుతుంది. ఇది జరిగితే శుభవార్త వింటారని.. ఏదైనా ఆగిపోయిన పని ఈ రోజు అకస్మాత్తుగా పూర్తవుతుందని నమ్ముతారు. 

పాల ఉత్పత్తులకు ఇలాంటి వ్యక్తులు వీలైనంత దూరంగా ఉండాలి.. ఎందుకంటే

ఉదయం లేవగానే మొదటగా పాలు లేదా పెరుగును చూస్తే, అది భవిష్యత్తులో అదృష్టాన్ని సూచిస్తుంది.

తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుండి పక్షుల కిలకిలరావాలు వింటే ఈ రోజు ఏదో మంచి జరగబోతోందని అర్థం చేసుకోండి.

వివాహిత స్త్రీ ముత్తైదువలా పూజ చేస్తున్నప్పుడు లేదా పూజా పళ్ళెం తీసుకుని వెళ్తూ కనిపిస్తే, అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. భారీ పనిని పొందబోతున్నారని అర్ధం.

ఎవరైనా ఉదయాన్నే చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే అది సంపద సంపాదనకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఆ రోజున మీరు కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతారని కూడా నమ్ముతారు.

bottom of page