top of page

మోదీ క్రేజ్ అంటే ఇలా ఉంటాది మరి..🌟

దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేశాయి..హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించానున్నారు.

కోల్‌కతా- హౌరా మధ్య ఈ అండర్‌ వాటర్‌ మెట్రో పరుగులు తీయనుంది. రేపటినుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రారంభోత్సవానికి ముందు.. ప్రధాని మోదీ కలకత్తాలోని మెట్రోస్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కోల్‌కత్తాలోని మెట్రో స్టేషన్‌లో ప్రజలు ‘మోదీ మోదీ’.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 15,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

కోల్‌కతా నగరంలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ వాటర్ రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మధ్య 16.6 కిలో మీటర్ల మేర మెట్రోమార్గాన్ని నిర్మించగా..ఇందులో 10.8 కి.మీ. భూగర్భంలోనే ఉంది. ఈ మెట్రో రైలులో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 2009లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించగా.. 2017లో ఈ టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభమైంది కోల్‌కతాలోనే కాగా.. ఇప్పుడు ఈ అద్భుతమైన అండర్‌ వాటర్‌ మెట్రో రైల్‌ సర్వీసులు కూడా అక్కడే ప్రారంభమవ్వడం విశేషం..


bottom of page