top of page

🌟 'మోదీ గొప్ప విజనరీ లీడర్.. బీసీ ముఖ్యమంత్రికి జనసేన పూర్తి మద్దతు': పవన్ కళ్యాణ్

📢 హైదరాబాద్, నవంబర్ 7: సకల జనుల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, 4 కోట్ల మంది పోరాటం చేస్తేనే తెలంగాణా వచ్చిందన్నారు జనసేన అధినేట పవన్ కళ్యాణ్. 🚀

అయితే నీరు-నిధులు-నియామకాలు అందరికీ అందుతున్నాయా అనేదే ఇక్కడ ప్రశ్న అని అభిప్రాయపడ్డారాయన. 🤔 తెలంగాణలో మోదీ ఆధ్వర్యంలో బీసీ అధికారం సాకారం కావాలన్నారు పవన్ కళ్యాణ్. 🏛️ నోటితో చెప్పడం తేలికేనని.. చేయడం కష్టమని.. బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించడం గర్వించదగ్గ విషయమన్నారు. 🤩 ఆ ప్రకటనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందన్నారు పవన్. 🤝 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభకు అతిధిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్.. 🏟️ ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

2004-14 వరకు ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ మోదీ వచ్చినప్పటి నుంచి వాటిని కంట్రోల్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 30 ఏండ్లల్లో లేని అభివృద్ధి.. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 10 ఏండ్లలో జరిగిందన్నారు. 📈 ఉగ్రవాదాన్ని అరికట్టడమే కాదు.. ప్రతీ భారతీయుడి గుండెల్లో మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. 😎 ‘మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ రద్దు చేసే వారు కాదు.. ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. ఆయన అద్భుతమైన విజనరీ లీడర్. 🌍 మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. 🇮🇳 ప్రపంచం మొత్తం మనల్ని ప్రశంసిస్తోంది’ అని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ప్రోత్సాహంతోనే చంద్రయాన్ 3 విజయం సాధించిందని చెప్పారు. 🚀

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page