📊జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు.. బీఆర్‌ఎస్‌ను సైడ్ చేసేసి, బస్తీమే సవాల్ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్ ప్లాన్‌తో ముందుకొస్తున్నాయి.
ఎంపీ ఎలక్‌షన్స్‌లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రంనుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అందుకే, సోనియాను.. తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. దీనిపై ఇవాళ జరిగిన పీఏసీ మీటింగ్‌లో… తీర్మానం కూడా చేసేసింది. మెదక్, మల్కాజ్‌గిరి, కరీంనగర్.. ఈ మూడింట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తోంది. బీజేపీ సైతం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదేటైపు అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 🚀