top of page

మోదీకి బంగ్లా చీఫ్‌ యూనస్‌ ఫోన్‌.. హిందువులు, మైనారిటీల భద్రతకు కట్టుబడి ఉన్నామని హామీ..


బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల రక్షణ, భద్రతకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్‌ యూనస్‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం ఆయన ఫోన్‌ చేశారు. బంగ్లాదేశ్‌ ప్రధానిగా హసీనా దిగిపోయి తాత్కాలిక చీఫ్‌గా యూనస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎక్స్‌లో చేసిన పోస్టులో నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మహమ్మద్‌ యూనస్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఇరువురం ప్రస్తుత పరిస్థితులపై భావాలు పంచుకున్నామని ఆయన చెప్పారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపగా, ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భద్రతకు యూనస్‌ హామీ ఇచ్చారన్నారు.

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల కొత్త పార్టీ?

ఆందోళనల ద్వారా దశాబ్దాల కాలంగా దేశాన్ని పాలిస్తున్న షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని దింపేసిన బంగ్లాదేశ్‌లోని విద్యార్థులు కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటున్నారు. బంగ్లాలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని దేశంలోని రెండు ప్రధాన పార్టీల డిమాండ్‌ను వారు వ్యతిరేకించడమే కాక, తమ ప్రగతిశీల భావాలకు అనుకూలంగా పాలన జరగాలంటే తామే అధికారంలోకి రావాలని భావిస్తు న్నారు.

కాగా, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని హసీనాపై విధిస్తున్న అధిక ఒత్తిడిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇదంతా విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి హసీనా దేశం విడిచి పారిపోవడానికి ఏడాది ముందు జరిగిందని భారత్‌, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనాన్ని ప్రచురించింది.


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page