top of page
Suresh D

వామ్మో.. ఒక్కసారి నడిస్తే రూ. 100 కోట్లు ? 😲

కేవలం కొన్ని నిమిషాలపాటు ర్యాంప్ వాక్ చేస్తే అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న మోడల్ ఎవరు ? 🤔

బాబోయ్.. ఒక్కసారి నడిస్తే రూ.100 కోట్లు తీసుకుంటుందట.. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం కొన్ని నిమిషాలపాటు ర్యా్ంప్ వాక్ చేస్తే అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న మోడల్ ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా ?.. తన పేరు జిగి హడిడ్. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మోడల్ ఆమె. ఇటీవల జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ లో తన వెర్సాస్ క్యాట్ వ్యాక్‍తో అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 28 ఏళ్ల ఈ యూఎస్.. డచ్.. పాలస్తీనియన్ మోడల్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఐకాన్‍గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడున్న ఫ్యాషన్ రంగంలో ఆమె టాప్ మోస్ట్ మోడల్.

బటన్ డౌన్ డిటైలింగ్, బ్లాక్ షీర్ డ్రెస్‍లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. ఆమె మిలన్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేసినందుకు వెర్సాస్ నుంచి దాదాపు 13 మిలియన్ యూఎస్డీ సంపాదించని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు మాత్రమే.

జిగి హాడిడ్ నికర విలువ సుమారు రూ. 30 మిలియన్ యూఎస్డీ. ఫ్యాషన్, మోడలింగ్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన మోడల్స్ లో జిగి ఒకరు. ఆమె సంవత్సరానికి 1 మిలియన్ వరకు సంపాదిస్తుందని సమాచారం. 2016లో, ఆమె బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ ద్వారా ఇంటర్నేషనల్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. ఆమె గెస్, టామ్ ఫోర్డ్, బాల్‌మైన్, మిస్సోని, మోస్చినో, ఇసాబెల్ మరాంట్‌లతో కలిసి పని చేసింది. ఆమె 2021లో $9 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. 🌟



bottom of page