top of page

🚆💰🙏💒🚉భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో నగరం నుంచి యాదాద్రికి MMTS రైళ్లు🚆💰

🚆💒తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా.

ప్రయాణఖర్చులు కూడా తగ్గుతాయని ఎప్పటినుంచో చెబుతున్నారు. భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకుంది. ట్రైన్లు రాయగిరి (యాదాద్రి) స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైన్ను వేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్‌ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వంరూ. 330 కోట్లు నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు. ఘట్కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం అయ్యే పూర్తి ఖర్చును కూడా కేంద్రమే భరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైన్ను వేస్తే హైదరాబాద్ నుంచి జస్ట్ రూ.20 ✨🚆

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page