top of page

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ వచ్చేసింది..

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా కాసేపటి క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువే నవ్వించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.


జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కథానాయికగా నటిస్తుంది. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా కాసేపటి క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువే నవ్వించేందుకు సిద్దమయినట్లుగా తెలుస్తోంది.బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది.బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో నటించిన అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page