top of page
Suresh D

జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!🗳️✨


ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం వేగం పెంచారు. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కావటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. గెలుపు పైన ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు సర్వేలు ఏపీలో ఎన్నికల ఫలితాల పైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. దీంతో..ఏపీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మే 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

ఏపీ ఎన్నికల్లో గెలుపు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ సమయంలో మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్‌4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్‌ గల్లంతు ఖాయమ‌ని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేదిన్నారు. అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేదని చెప్పుకొచ్చారు. ఎవరు దాడి చేశారు..దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుందని వివరించారు. ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికని ప్రశ్నించారు. సిద్ధం సభలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుంటే విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయని జోగి రమేష్ పేర్కొన్నారు.పేదల పక్షాన జగనన్న ఉన్నారన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మం గాక నమ్మం అని చెప్తున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు పెడనలో నిన్న ఇష్టారీతిన మాట్లాడారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కుప్పంలో నువ్వు ఓడిపోయి, హైదరాబాద్‌ పారిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలు వదిలి, ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే హైదారాబాద్‌లో షూటింగులు చేసుకుంటారని పేర్కొన్నారు. దమ్ముగా, ధైర్యంగా ఉన్నాం. జగనన్న సైనికుల్లా ఉన్నాం..ఆయన వెంటే నడుస్తామని జోగి రమేష్ స్పష్టం చేసారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌..ఇద్దరూ ఓడిపోయి హైదరాబాద్‌ పారిపోబోతున్నారని జోగి రమేష్ జోస్యం చెప్పారు.🗳️ 


bottom of page