top of page

తెలంగాణలో రేషన్ కార్డుల రద్దు ?.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ🤔👍

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దైనట్లు ప్రచారం జరగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దైనట్లు ప్రచారం జరుగుతోంది. మండలాల వారీగా రద్దైన రేషన్ కార్డుల వివరాలను కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదే విషయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసదుద్దీన్ ఓవైసీ క్లారిటీ అడిగారు. రేషన్ కార్డులు రద్దు అంటుూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తను ఉత్తమ్‌కు ట్యాగ్ చేసిన అసద్.. ఇది నిజమేనా? అని అడిగారు. అసద్ ట్వీట్‌కు ఉత్తమ్ రిప్లయ్ ఇచ్చారు. రేషన్ కార్డుల రద్దుపై క్లారిటీ ఇచ్చారు. రేషన్‌కార్డుల రద్దు వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని చెప్పారు. ఇక మీదట చేయబోదని చెప్పిన ఉత్తమ్.. ఇది నా హామీ అంటూ అసదుద్దీన్‌ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు.🤔👍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page