top of page

మేం ఫేమస్ ఫుల్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..

ఈ మ‌ధ్య‌ కేవలం ప్ర‌మోష‌న్స్‌తోనే హైప్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది మరో అనుమానం లేకుండా మేం ఫేమస్ మాత్రమే. దీనికోసం స్టార్స్ అంతా కదిలొచ్చారు..మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా సినిమా అద్భుతం అంటూ విడుదలకు ముందే ట్వీట్ చేసారు.


న‌టీన‌టులు: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ తదితరులు

సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ దూపాటి

బ్యానర్లు : చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

నిర్మాతలు : అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం : సుమంత్ ప్రభాస్

ఈ మ‌ధ్య‌ కేవలం ప్ర‌మోష‌న్స్‌తోనే హైప్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది మరో అనుమానం లేకుండా మేం ఫేమస్ మాత్రమే. దీనికోసం స్టార్స్ అంతా కదిలొచ్చారు.. వీడియోలు చేసారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా సినిమా అద్భుతం అంటూ విడుదలకు ముందే ట్వీట్ చేసారు. మరి ఈ సినిమాలో నిజంగానే అంత విషయం ఉందా..? కథ : ఈ సినిమా కథ అంతా బండ‌న‌ర్సంప‌ల్లి అనే గ్రామంలోనే జరుగుతుంది. ఆ ఊళ్ళోనే ఉండు ముగ్గురు స్నేహితుల కథ ఇది. మ‌హేష్ అలియాస్ మై (సుమంత్ ప్ర‌భాస్), దుర్గ (మ‌ణి ఎగుర్ల‌), బాల‌కృష్ణ (మౌర్య‌) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాగే పనీ పాట లేకుండా ఊరి మీద పడి బలాదూర్‌గా తిరగడం.. ఏదో ఓ తిక్క పని చేసి అందరితో చివాట్లు తినడమే వాళ్ల పని. అంతా వీళ్లను ఏదో ఓ పని చేసుకోండ్రా అంటూ తిడుతూ ఉంటారు. ఓ సమయంలో ఊరంతా ఒక్కటై వీళ్లను నిలదీస్తుంది. ఇక ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలని ఫిక్సైపోతారు ఈ ముగ్గురు. అలా ఓ బిజినెస్ పెడతారు.. మంచి లాభాలు వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో అనుకోని పరిస్థితుల కారణంగా అప్పటి వరకు సంపాదించింది పొవడమే కాకుండా.. మీద నుంచి 2 లక్షల అప్పు కూడా పడుతుంది. దాంతో జీవితం అంతా తలకిందులు అయిపోతుంది. పైగా మై ప్రాణంగా ప్రేమించిన మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌), బాల ప్రాణంగా ప్రేమించిన బబ్బీ (సిరా రాశీ) తో విడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేసారు.. ఫేమస్ అవ్వడానికి మళ్లీ ఎలాంటి దారి ఎంచుకున్నారు అనేది మిగిలిన కథ.. నటీనటులు : సుమంత్ ప్ర‌భాస్ అదరగొట్టాడు. స్క్రీన్ మీద ఎనర్జీ నెక్ట్స్ లెవల్ అంతే. పైగా తన స్క్రిప్ట్ కావడంతో ఇంకా రెచ్చిపోయాడు. మై పాత్రకు ప్రాణం పోసాడు. మనోడి కామెడీ టైమింగ్ అదుర్స్ అంతే. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా చాలా బాగా నటించారు. న్యాచురల్‌గా కనిపించారు. హీరో మరదలి పాత్రలో సార్య లక్ష్మణ్.. బబ్బీగా సిరా రాశీ బాగున్నారు. మరో కీలక పాత్రల్లో ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, అంజిమామ‌, న‌రేంద్ర‌ర‌వి ఆకట్టుకున్నారు. పంచ్ లైన్:ఓవరాల్‌గా మేం ఫేమస్.. అంత ఫేమస్ కాదు కానీ జస్ట్ ఓకే.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page