top of page

బాసు ముందు .. మిల్కీ బ్యూటీ కూడా మిల్క్ షేకే ..! 😎💖

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) వయసంటే పెరుగుతుంది కానీ.. ఆయన గ్లామర్, గ్రేసు ఏమాత్రం తగ్గడం లేదు. 67 ఏళ్ల వయసులోనూ మిల్కీ బ్యూటీతో స్టెప్పులేస్తూ ఆమెనే డామినేట్ చేస్తున్నారు మెగాస్టార్. 💪💃


‘భోళా శంకర్’ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ‘భోళా మేనియా’ అనే టైటిల్ సాంగ్‌తో పాటు ‘జామ్ జామ్ జజ్జనక’ అనే ఫ్యామిలీ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ మూడో పాటను విడుదల చేశారు. గత రెండు పాటలు ఫాస్ట్ బీట్స్ కాగా.. ఇది మాత్రం మెలోడి. చిరంజీవి, తమన్నాపై చిత్రీకరించిన డ్యూయెట్. ‘మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ’ అంటూ సాగే ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ విజువల్స్, చిరంజీవి గ్లామర్, గ్రేస్ అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే చిరంజీవి పక్కన తమన్నా ఆనట్లేదు. ఇక మెగాస్టార్ కోసం ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా అదుర్స్. 👗💫

మెలోడి బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజే కలసి ఆలపించారు. మహతి స్వర సాగర్ కూడా శృతి కలిపారు. ఈ పాటకు ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.థమన్ విడుదల చేశారు. 🎶🎬


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page