top of page
MediaFx

నెల రోజుల గ్యాప్ తర్వాత.. మళ్ళీ ‘విశ్వంభర’ షూట్ మొదలు పెట్టిన మెగాస్టార్.. 🌟

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ(Director Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్స్ చేస్తుంది.

ఇటీవల నెల రోజుల క్రితం ఏప్రిల్ మొదట్లో విశ్వంభర సినిమా ఇంటెర్వెల్ యాక్షన్ సీన్ ని ఆల్మోస్ట్ 22 రోజుల పాటు షూట్ చేసారు. హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల్ వద్ద పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, సెట్ ఏర్పాటు చేసి ఈ యాక్షన్ సీన్ షూట్ చేసారు. ఆ సెట్ నుంచి చిరంజీవి, త్రిష ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ కి గ్యాప్ తీసుకున్నారు.

ఈ గ్యాప్ లో మెగాస్టార్ భార్యతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లి రావడం, ఎన్నికలు, పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం.. ఇలా వేరేవేరే పనులతో బిజీగా ఉన్నారు. తాజాగా మళ్ళీ నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ మొదలుపెట్టారని తెలుస్తుంది. నేటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతుందని సమాచారం. మరో భారీ షెడ్యూల్ నే ప్లాన్ చేసాడట డైరెక్టర్ వశిష్ఠ.

Related Posts

See All

నైజాం మార్కెట్ లో ఇక నుంచి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ షేర్లు🎥

అయితే ఇది మరీ ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కనిపించింది. దీనితో తాజాగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గ్రాండ్ గా “కల్కి” ఈవెంట్ ను ప్లాన్ చేసిన టీమ్..!🌟

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డ

కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా ఓ సినిమా చేసింది తెలుసా?🌟

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

bottom of page