top of page

🌟 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు...

“తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు కొత్త ప్రభుత్వంలోని మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అత్యున్నత స్థాయికి వెళ్లాలని .. మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

🎥 ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ మూవీలో హీరోయిన్ త్రిష మరోసారి చిరు జోడిగా నటించనుందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవులలో జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ సా్టోరీ పంచభూతాలు చూట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. 🎬



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page