👑 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 📖
నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ వేదికగా ఈ ప్రేమ పక్షుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 💒 మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. 🌟
🎉 ఇక వరుణ్-లావణ్యల వివాహానికి హాజరుకాని వారి కోసం ఆదివారం (నవంబర్ 5) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 🎊 పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ పార్టీలో సందడి చేశారు. 🌠
👗 రిసెప్షన్ పార్టీలో గోల్డ్ కలర్ శారీలో ట్రెడిషినల్ లుక్‌తో సింపుల్‌గా కనిపించింది లావణ్య త్రిపాఠి. 💃 నుదుటున సింధూరం మెగా కోడలి అందాన్ని మరింత పెంచేసింది. 💖
💐 ఇక రిసెప్షన్ పార్టీకి వచ్చిన అతిథులందరితోనూ ఎంతో ఓపికగా ఫొటోలు దిగారు నూతన వధూవరులు. 📸 అయితే ఇక్కడే అభిమానుల మనసులు గెల్చుకుంది మెగా కోడలు. 💖 తమను ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవి కాళ్లు మొక్కి దీవెనలు అందుకుంది లావణ్య. 🙏
📽️ అలాగే సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు శిక్షణ ఇచ్చిన సత్యానంద్ పాదాలకు నమస్కరించింది. 🙏 ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. 📷 మెగా కోడలి వినయం, విధేయత, పెద్దల పట్ల గౌరవాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. 🤗🎉