top of page

🎥🌍 వారం రోజులు షూటింగ్స్ కు దూరంగా మెగా ఫ్యామిలీ 🎬

📆 నవంబర్ 1న వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరగబోతుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలంతా అక్కడికి వెళ్ళారు. 💑 దాంతో మెగా షూటింగ్స్‌కు వారం రోజులు బ్రేక్ పడనుంది. 🚫

🌟 మరోవైపు ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన షూటింగ్స్ మాత్రం ఆగట్లేదు. కల్కి షూటింగ్‌ శంకరపల్లిలో జరుగుతుంది. 💥 సలార్ ప్యాచ్ వర్క్స్ కూడా నాన్‌స్టాప్‌గా జరుగుతూనే ఉన్నాయి. 🔥

🎬 షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ హైదరాబాద్ దాటి బయటికి వెళ్లారు దేవర టీం. 🔥 జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ సహా కీ మెంబర్స్ అంతా గోవాకు వెళ్ళారు. 🌴 అక్కడ లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. 🏝️ గోవా తర్వాత గోకర్ణకు వెళ్లనుంది దేవర టీం. 🌞 మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. 🎬

🔥 నాగార్జున నా సామిరంగా షూటింగ్ అజీజ్ నగర్ చిత్రమందిర్‌లో జరుగుతుంది. 💫 విజయ్ దేవరకొండ, పరశురామ్ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ వాయుపురీ కాలనీలో జరుగుతుండగా.. 🎥 నితిన్, వక్కంతం వంశీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. 🎬

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page