top of page

చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నా యంగ్‌ బ్యూటీ 🌟


చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్ చేసినా, స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు మీనాక్షి చౌదరి. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్‌ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? హావ్‌ ఏ లుక్‌!

గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్ చేసినా, స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్‌ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసిన ఈ బ్యూటీ, రీసెంట్‌గా మహేష్ బాబు గుంటూరు కారంలో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలు మంచి సక్సెస్ కావటంతో ఇప్పుడు మీనాక్షి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్.

ప్రస్తుతం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్ మూవీతో పాటు, వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్‌సేన్ మూవీలోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇంత బిజీలోనూ ఓ సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ బ్యూటీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్. మరి ఈ సినిమాలతో మీనాక్షి స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page