top of page
Shiva YT

🚑 తెలంగాణలో విస్తృతం కానున్న వైద్య సేవలు..🚑

🏥 తెలంగాణలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మరికొన్ని అంబులెన్స్‌లను ఇవాళ్లి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం అత్యవసర వైద్య సేవల కోసం కొత్తగా 466 వాహనాలను సమకూరుస్తున్నారు.

వాటిలో 204 సాధారణ అంబులెన్సులు, కాగా మరో 228 అమ్మఒడి రవాణకు వినియోగించనున్నారు. ఇక పార్దివ దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు 34 అంబులెన్స్‌లను కేటాయించారు. అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్య సేవలు అందనున్నాయి. ఉదయం 10 గంటలకు నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అంబులెన్సు వాహనాలను కేసీఆర్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు.

bottom of page