స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. 🚔💼 వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. 💧🌞 ఆయనకు చికిత్స అందించారు. 🏥
తాజాగా బాబుకు స్కిన్ అలర్జీ కూడా రావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. 🌡️💼 సెంట్రల్ జైలుకు వెళ్లిన డెర్మటాలజిస్టులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత దేవి వైద్య పరీక్షలు నిర్వహించారు. 👩⚕️🏨 అంతేకాకుండా.. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైల్లోనే ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. 💼🏥 తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిన్ అలర్జీ వచ్చినట్లు తెలిపారు. 🤨🛏️ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 📢💉 బాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరంలేదని వెల్లడించారు. 🙏🌡️
రాజమండ్రి పరిసరాల్లో కొన్ని రోజులుగా వాతావరణం అంతగా బాగోలేదు. 🏞️ పైగా 2వేల మందికి పైగా ఖైదీలు ఉన్న జైలులో ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 🙁🌫️ ఏసీకి అలవాటు పడిన చంద్రబాబు.. 🌾 జైలు వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. 🤔
73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు.. 📅 ఆయనతో ములాఖత్ అయిన ప్రతిసారీ కుటుంబసభ్యులు ఆరోపించారు. 👨👩👧👦 అటు టీడీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళన వ్యక్తం చేశారు. 📢🤝 ఇప్పుడు హుటాహుటిన వైద్యులు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించడంతో.. 🩺 చంద్రబాబుకు ఏమైందనే ఆందోళన మొదలైంది. 🙌🩺