top of page

మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేట్ వీడియో ఉంది.. లావణ్య షాకింగ్ కామెంట్స్


తాజాగా విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయిని పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు పోలీసులు ఆధారాలు రాబడుతున్నారు. పోలీసులు గుంటూరులో ఉన్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాంటాక్ట్స్‌పై దృష్టి పెట్టారు. మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు.. అలాగే సినిమా వాళ్లతో ఎవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మస్తాన్ సాయి ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇదిలా ఉంటే తాజాగా మస్తాన్ సాయి పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. గతంలో లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని ఇప్పటికే రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మస్తాన్ సాయి పై లావణ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. మస్తాన్ సాయి దగ్గర తన ప్రైవేట్ వీడియో ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు రమ్మన్నాడు. పెళ్ళికి వచ్చిన లావణ్యను ఓ హోటల్ లో ఉంచాడు. అదే సమయంలో లావణ్య హోటల్‌లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి ఆమెను కొట్టి ఆమె ఫోన్ లాక్కొని అత్యాచారయత్నం చేసినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని తాజాగా లావణ్య చెప్పుకొచ్చింది. మస్తాన్ సాయి మొబైల్‌లో తన ప్రైవేటు వీడియో కూడా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ విషయం రాజ్ తరుణ్ కు కూడా తెలుసు అని చెప్పుకొచ్చింది లావణ్య.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page