top of page

‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్: సంపూర్ణేష్ బాబు కొత్త అవతారం🎥🎞️

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా.. తన శైలిని వదులుకోకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్‌లో ఉంటూనే నటుడిగానూ రాణిస్తున్నారు. తాజాగా ఆయన నటించి.. స్క్రీన్‌ప్లే, మాటలు అందించి.. నిర్మాణంలో భాగస్వామి అయిన సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీ నుండి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘మండేలా’ సినిమా 2021లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. పొలిటికల్ సెటైర్ మూవీగా మంచి వినోదాన్ని పంచింది ఈ సినిమా. ‘మండేలా’ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసి ‘మార్టిన్ లూథర్ కింగ్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు వెంకటేష్ మహా. ఆయన స్క్రీన్‌ప్లే, మాటలు రాసి.. పూజ కొల్లూరును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.🎥🎞️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page