top of page
MediaFx

పెళ్లైన మగవారు మరొక స్త్రీకి దగ్గరవ్వడానికి చెప్పే అబద్ధాలు 🚫💔

మగవారు పెళ్లి అయిన తర్వాత కూడా మరో స్త్రీకి ఆకర్షితులై, దగ్గరవ్వాలనుకునే సమయంలో చెప్పే అబద్ధాలను గుర్తించడం ద్వారా అలాంటి సంబంధాలకు దూరంగా ఉండవచ్చు.

ఇష్టంలేని పెళ్లి..

సాధారణంగా పెళ్లి కాదనుకుని మరో స్త్రీని కోరుకునే మగవారు మొదటగా చెప్పే అబద్ధం తమకి ఇష్టంలేని పెళ్లి చేసుకుంటారని.. దీని వల్ల తాము ఆనందంగా ఉండలేదని, విడిపోవాలని చెప్పి వేరే వారికి దగ్గరవుతారు. ఇలాంటివారికి దూరంగా ఉండటం మంచిది.

ఒంటరిగా ఉన్నానని..

మరో మహిళకి దగ్గరవ్వాలనుకునే మగవారు చెప్పే మరో అబద్ధం.. భార్యతో గొడవల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని.. వారు నిజంగానే ఒంటరిగా ఉండొచ్చు. కానీ, చట్టపరంగా విడిపోలేదేమో. ఇది కనుకున్నాకే వారికి దగ్గరవ్వడం మంచిది.

భార్య గురించి చెడుగా చెప్పడం..

అదే విధంగా భార్యల గురించి వారి స్వభావం గురించి చెడుగా చెప్పి వేరేవారికి దగ్గరవుతారు. భార్య తనని గౌరవించదని.. దీని కారణంగా వేరే స్త్రీ తనకి జాలితో దగ్గరవుతుందని కోరుకుంటారు. వారికి మరో స్త్రీని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసు కాబట్టే.. ఇలా చేస్తారు.

ఆందోళన..

ఇది మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే ప్రతి మగవ్యక్తి చెప్పే అబద్ధం.. తాము భార్యలతో సుఖపడడం లేదని.. శృంగార పరంగా వారు ఆనందంగా లేమని ఈ కారణంగానే వారు మరో వ్యక్తిని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

పిల్లలు పుట్టట్లేదని..

మరో ముఖ్య అబద్ధం.. తన భార్యకి లోపం కారణంగా పిల్లలు పుట్టడం లేదని. దాంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయని, ప్రశాంతంగా కరువైందని.. ఈ కారణంగానే తాము మరో సంబంధం కోసం వెతుకుతున్నామని చెప్పారు.

ఇలా అబద్దాలు చెప్పి మరో స్త్రీకి దగ్గరయ్యే మగవారిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. దీని వల్ల మీకు మీరుగానే ఇరకాటంలో పడతారు

bottom of page