top of page
MediaFx

"మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు! 🎬🍿"


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మలయాళ సినిమాల హవా ముందుకు సాగుతోంది. 'ప్రేమ‌లు', 'భ్ర‌మ‌యుగం' వంటి మలయాళ చిత్రాలు తెలుగులో కూడా భారీ వసూళ్లు సాధించాయి. తాజాగా, 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రం మలయాళ సినిమా రికార్డులను తిరగరాసింది, ఏకంగా ₹230 కోట్లు వసూళ్లు చేసి ఘనత సాధించింది. తెలుగులోనూ ఈ సినిమాకు అద్భుత స్పందన అందుతోంది. థియేటర్లలో ఇంకా ఆడుతున్న ఈ చిత్రం ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 3 నుంచి ప్రసారం కానుంది. మలయాళంతో పాటుగా తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండబోతుంది. చిదంబర్ పీ పొదువల్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మితమైన ఈ సినిమాలో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెరకెక్కింది. కోడైకెనాల్ లోని ఒక ప్రమాదకరమైన గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహార యాత్ర కు వెళతుంది. అయితే స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తూ గుహలో పడిపోతారు. మరి ఆ యువకుడిని ఆ బృందం ఎలా కాపాడుకుంది? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా.


bottom of page