top of page

“మంజుమ్మెల్ బాయ్స్” మూవీ రివ్యూ ..🎥✨

చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమా ఈ రోజు విడుద‌లైంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

డిఫరెంట్ సర్వైవల్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఓ లోతైన లోయ‌ చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్, అలాగే స్నేహితుల మధ్య ఎమోషన్స్, టూరిస్ట్ గా వెళ్ళి రియ‌లిస్టిక్‌ గా అనుకోని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లోయలో నుండి బయట పడే సీన్స్ మరియు చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ఈ సినిమాకే హైలెట్స్ గా నిలిచాయి. వందలాది అడుగుల లోతైన లోయ‌లో ప‌డిన ఓ యువ‌కుడిని అత‌డి స్నేహితులు ప్రాణాల‌కు తెగించి ఎలా కాపాడారు అన్న‌దే మెయిన్ పాయింట్.

ఈ చిన్న పాయింట్‌ చుట్టూ రియ‌లిస్టిక్‌ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చిదంబరం చాలా బాగా బిల్డ్ చేశాడు. అలాగే, న‌టీన‌టుల యాక్టింగ్‌, విజువ‌ల్స్‌, బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. షౌబిన్ షాహిర్‌, శ్రీనాథ్ భాషిలతో పాటు మిగిలిన పాత్ర‌ధారులందరూ చాలా బాగా నటించారు. వారిది యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్క‌డ క‌ల‌గ‌దు. రియ‌ల్‌ లైఫ్‌ లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారో, వాళ్ల అల్ల‌రి కూడా అలాగే సాగింది. రియల్ మంజుమ్మెల్ బాయ్స్‌ లా వారి నటన ఆకట్టుకుంది.

ఇక వంద‌ల అడుగుల లోతైన లోయ‌ల్లో పడ్డాక సాగిన సన్నివేశాలు చాలా సహజంగా అనిపించాయి. ఆ లోయలో ప‌డ్డ‌వాళ్లెవ్వ‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డలేదు అని తెలిసనా తమ స్నేహితుడి కోసం మంజుమ్మల్ బాయ్స్ ప్రాణాలకు తెగించే సంఘటనలు కూడా ఆకట్టుకుంటాయి. పోలీస్ స్టేషన్ సీన్ తో పాటు సుభాష్‌ను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి. ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్ లను ప్రస్తుత లోయ ప్రాంతానికి కనెక్ట్ చేస్తూ చిదంబరం రాసుకున్న స్క్రీన్‌ ప్లే బాగుంది. అలాగే, ఈ సర్వైవల్ థ్రిల్లర్‌లలోని ఎమోషన్స్ అండ్ మెసేజ్ మరియు వాస్తవికత కూడా చాలా బాగా కుదిరింది. 

ఈ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కి మాత్రం దూరంగా సాగింది. ఇక చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే, కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది ?, సుభాష్ పాత్ర ఆ లోయ నుంచి ఎలా బయట పడతాడు ? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే స్లో అయ్యింది.  

‘మంజుమ్మల్ బాయ్స్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్‌ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోయాయి. అలాగే నటీనటుల నటన అద్భుతంగా అనిపిస్తోంది. ముఖ్యంగా కుట్ట‌న్‌ – సుభాష్ మరియు ప్రధాన పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో రియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ డీసెంట్ ఫీల్ గుడ్ మెసేజ్ చాలా బాగా ఆకట్టుకుంటాయి.🎥✨

bottom of page