top of page

🇮🇳 మణిపూర్ ఘటనపై చర్చ 🗣️ పార్లమెంట్ లో గందరగోళం!! 💥

మణిపూర్ ఘటన మీద పార్లమెంట్‌లో తప్పకుండా చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. స్టేట్‌లో, సెంట్రల్‌లో బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయని తెలిపారు. ఈ ఘటన వల్ల ఇండియా పరువు పోయిందని, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ డిమాండ్ చేశారు. 💔🗣️

ఇలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ 1800 గంటల మౌనం తర్వాత మణిపూర్ ఘోరం పై 30 సెకండ్ల సానుభూతి తెలిపారని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. 😡 ఇంత దారుణమైన ఘటనపై ప్రధాని మోడీ స్పందన ఇదేనా అంటూ మండిపడుతున్నారు. 😔 మణిపూర్లో అల్లర్లపై మొదటి నుంచి కేంద్రం అలసత్వం వహించినదని, హింస ప్రారంభమైన నెలరోజుల తర్వాత హోం మంత్రి రాష్ట్రంలో పర్యటించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 🚶‍♂️🔴 మణిపూర్‌లో మహిళల నగ్న వీడియోలు, వారిపై జరిగిన హింస దేశాన్ని సిగ్గుపడేలా చేశాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 👀 మోడీ స్పందనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 😤 ప్రధాని మోడీ... ఇది దేశానికి అవమానం కలిగించే విషయం మాత్రమే కాదు ఈ సమస్య మణిపూర్‌లోని మహిళలకు తగిలిన తీవ్రమైన గాయం అన్నారు. 💔 హింసను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పార్లమెంట్ లో దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page