top of page
MediaFx

‘మ‌ల్లె పూల ట్యాక్సీ’తో వ‌చ్చేసిన మంగ్లీ.. సాంగ్ అదిరిందిగా!

ఫోక్ సింగర్ మంగ్లీ తనదైన పాటలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మంగ్లీ పాడిన పాటలు వరుసగా హిట్ అవుతుండటంతో తమ సినిమాలో ఖచ్చితంగా ఆమె పాట ఉండేలా దర్శకనిర్మాతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మంగ్లీ పాడిన ఓ సరికొత్త పాటను "ధూం ధాం" మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" సినిమాలో ‘మల్లెపూల ట్యాక్సీ’ అనే క్యాచీ సాంగ్ ను మంగ్లీ పాడారు. ఈ పాటకు గోపీ సుందర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. కాగా, ఈ సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ పెళ్లి సందర్భంలో ఈ పాట రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సాంగ్ లో మరో విశేషమేమిటంటే, మంగ్లీ ఈ పాటను పాడటమే కాకుండా తెరపై కూడా కనిపిస్తుంది. ఈ సాంగ్ లో ఆమె స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఈ పాటను తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు. మచ్చ సాయి కిషోర్ తెరక్కించిన ఈ సినిమాను ఎం.ఎస్. రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై నెలలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.



bottom of page