top of page

మంచు మనోజ్- మౌనికల కూతురు పేరు ఇదే..


మంచు మనోజ్, మౌనికలు తమ కూతురికి నామకరణం చేశారు. ఈ బారసాల కార్యక్రమానికి సంబంధించిన పోస్ట్‌ను వేస్తూ అభిమానుల నుంచి ఆశీర్వదాలు, విషెస్‌ను కోరాడు. తమ కూతురికి పేరు పెట్టినట్టుగా ప్రకటించాడు. దేవసేన శోభా ఎంఎం అంటూ తమ కూతురికి పేరు పెట్టినట్టుగా ప్రకటించి.. ఈ ప్రపంచానికి తమ కూతురిని ఇలా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్. మోహన్ బాబు తన మనవరాలిని చూసి మురిసిపోతోన్నట్టుగా ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది.మంచు మనోజ్ వేసిన ట్వీట్‌లో ఇలా ఉంది.. ఎంఎం పులి అనే నిక్ నేమ్‌తో నా కూతురు మీ అందరికీ తెలుసు.. శివ భక్తులమైన మేం.. మా చిట్టితల్లి పేరుని సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు అయిన దేవసేన అని పెట్టాం. దాంతో పాటుగా మా అత్తగారైన శోభా నాగి రెడ్డి గారి గుర్తుగా శోభా అని కూడా పెట్టాం. ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉంటాయి.

మా దేవసేన అన్నయ్య.. ధైరవ్ నాగి రెడ్డి తన చిట్టి చెల్లిని ఎంతో ప్రేమ, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.. భూమా నాగిరెడ్డి గారు మా అందరినీ ముందుండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.. నా తల్లిదండ్రులైన మోహన్ బాబు గారు, నిర్మలా దేవీ గారు మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తున్నారు..మా అక్క మంచు లక్ష్మీ ముందు నుంచీ మా మీద నమ్మకంతో మా వెంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.. మా అక్కకి థాంక్స్.. మౌనిక అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.. నా ఫ్రెండ్స్, అభిమానులు ఇలా అందరికీ ధన్యవాదాలు.. అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.గత ఏడాది మార్చిలో మౌనిక, మనోజ్‌ల వివాహాం జరిగిందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13న తనకు బిడ్డ పుట్టిందని మనోజ్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఇలా పేరుని ప్రకటించి తన సంతోషాన్ని అందరికీ తెలియజేశాడు. మనోజ్ ప్రస్తుతం బుల్లితెరపై షోలు, వెండితెరపై సినిమాలంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తేజ సజ్జా మిరాయ్ చిత్రంలో విలన్‌గా మనోజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page