top of page

మళ్లీపెళ్లి పై రమ్య రఘుపతి లొల్లి..

సీనియర్ నరేష్ సినిమా విడుదలైన కూడా వివాదాలు మాత్రం వదలడం లేదు.. నరేష్ రీసెంట్ గా నటించిన సినిమా మళ్లీ పెళ్లి.

నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉనన్ విషయం తెలిసిందే. దీని పై ఇప్పటికే నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి పలుసారి పోలీసులను, కోర్టులను ఆశ్రయించారు. అయినా కూడా నరేష్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఈసారి ఏకంగా పవిత్ర లోకేష్ తో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. ఈ సినిమా మొన్నీమధ్య థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చింది. మళ్లీ పెళ్లి సినిమా ఏకంగా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. కానీ ఈ సినిమాకు రమ్య రఘుపతి ఊహించని షాక్ ఇచ్చారు.మళ్లీ పెళ్లి సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. నేటి నుంచి ఈ రెండు ఓటీటీల్లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఆహాకు అమెజాన్ కు రమ్య రఘుపతి లీగల్ నోటీసులు పంపించారు.తనను కించపరిచేలా ఓ పాత్రను రూపొందించిన మళ్లీ పెళ్లి సినిమాను ప్రసారం చెయ్యొదంటూ ఆమె నోటీసులు పంపించారు. దాంతో మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది. కానీ ఆహాలో మాత్రా సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ వ్యవహారం పై నటుడు నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page