top of page

మళ్ళీ పెళ్లి ఈ వారం నుంచి OTT లో

టాలీవుడ్ లేట్ ఏజ్ హాట్ కపుల్ నరేష్ మరియు పవిత్ర నటించిన మళ్ళీ పెళ్లి ఈ వారం OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానుంది.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో బోల్డ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నరేష్, పవిత్రా లోకేశ్‌ల రిలేషన్‌షిప్‌పై మళ్లీ పెళ్లి అనే సినిమా తెరకెక్కింది. దీనికి ఎం.స్. రాజు దర్శకుడు . విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మల్లి పెళ్లి అనేది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మంచి రొమాంటిక్ డ్రామా. ఇద్దరు మిడిల్ ఏజ్ సెలబ్రిటీ ప్రేమకథను ఈ చిత్రం మనకు చూపిస్తుంది. థియేటర్లలో బాగా ఆడకపోయినా మల్లి పెళ్లి ఒక్కసారి ఖచ్చితంగా చూడవల్సిన చిత్రం . ఇది పూర్తిగా OTT సెట్ అయ్యే సినిమా.మల్లి పెళ్లి ఇప్పుడు OTT లో ఈ వారం ప్రసారం కానుంది. ఈ చిత్రం జూన్ 23 (శుక్రవారం) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా ఆహాలో ప్రసారం కానుంది.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page